ప్రముఖ కూచిపూడి గురువు మూలుపూరి శైలజా ప్రసాదు శిష్యురాలు, 13 ఏళ్ల లాస్యశ్రీ మంగిపూడి కూచిపూడి ఆరంగేట్రం కార్యక్రమం ఘనంగా సాగింది. భామాకలాపం, అన్నమాచార్య కీర్తన నారాయణ తీర్థ తరంగం, గోవర్ధన గిరిధార, థిల్లాన నాగ నృత్యం, మహేశ్వరి మహాకాళి ప్రదర్శించిన లాస్యశ్రీ తన నృత్యంతో నృత్య కళాభిమానులను, ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.