Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad Metro: ప్రయాణికులకు అలర్ట్‌.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు

Hyderabad Metro: ప్రయాణికులకు అలర్ట్‌.. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు

Hyderabad Metro Timings Change: సోమవారం(నవంబర్‌ 3) నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ L&T మెట్రో రైలు తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. నూతన షెడ్యూల్‌ ప్రకారం నగరవాసులకు జర్నీ మరింత సులభతరం కానుంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/ghmc-35-employees-retiring-venugopal-appriciation/

హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. నవంబర్‌ 3 నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. నగరంలోని అన్ని టెర్మినెల్స్‌కు ఈ ప్రయాణ సదుపాయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసమే మెట్రో సమయాల్లో మార్పులు సవరించినట్లు L & T వెల్లడించింది. ప్రయాణికులు ఈ నూతన షెడ్యూల్‌కు అనుగుణంగా తమ ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. 

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/yashoda-gastroenterology-conference-workshop-2025-on-gastric-problems/

కాగా, ప్రస్తుతం చూసుకుంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో సేవలు అందుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. సోమవారం నుంచి మెట్రో రైలు సమయవేళల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వారాంతాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad