హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పలువురు వాహనదారులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. తాజాగా హైదరాబాద్ ORRపై జరిగిన యాక్సిడెంట్ షాకింగ్ కు గురి చేసింది. పటాన్ చెరు మండలం పాటి గ్రామం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళుతున్న BMW కారు.. ముందు వెళుతున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో BMW కారు ముందు భాగం అంతా నుజ్జునుజ్జు అయ్యింది. టైర్లు ఊడిపోయాయి. ఇంజన్ తప్పితే మిగతా భాగం అంతా నుజ్జునుజ్జు అయ్యింది.
డ్రైవర్ కారు స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. అయితే సరైన సమయానికి బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. నరకయాతన అనుభవిస్తున్న అతడిని స్థానికులు బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
అయితే ట్రాలీ ఆటోను గుద్ది కారు నుజ్జునుజ్జు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఘటనా స్థలం వద్ద కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఇటీవల కాలంలో ORRపై తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు అతివేగంగా నడపడమే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది.