Hyderabad Rain Alert:హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ రోజు మధ్యాహ్నం మూడులోగా ఇళ్లకు చేరుకోవాలని తెలిపింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) ఆగస్టు 12, 13 తేదీల్లో భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఆగస్టు 15న ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజుల్లో అతి భారీ వర్షాలు, ఉరుములు, గాలులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 14 నుంచి 17 వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం కూడా ఉంది.
ALSO READ: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-rain-a…me-for-employees/
ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సేఫ్టీ కోసం సూచనలు ఇచ్చారు. కంపెనీలు తమ ఉద్యోగులను సాయంత్రం 3 గంటలలోపు ఇంటికి పంపమని అడ్వైజ్ చేశారు. దీని వల్ల ట్రాఫిక్ జామ్ తగ్గుతుంది. ఎమర్జెన్సీ వాహనాలు సులభంగా వెళ్లగలవు. యెల్లో అలర్ట్ ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. ఇందులో మోడరేట్ నుంచి హెవీ రెయిన్, థండర్‌షవర్స్ ఉంటాయి.
ప్రజలు ఇంట్లోనే ఉండాలి. అవసరమైతే మాత్రమే బయటికి వెళ్లాలి. వర్షంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నీటి మడుగుల్లోకి వెళ్లకండని తెలిపింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వరద ఏరియాలను సందర్శించి, అధికారులకు సూచనలు ఇచ్చారు.


