Srushti Fertility IVF Scam: హైదరాబాద్‌లోని గోపాలపురం పోలీసులు సరోగసీ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన డా. పచ్చిపాల నమ్రతకు చెందిన 8 బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. సికింద్రాబాద్‌లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను నడుపుతున్న డా. నమ్రత, తన కొడుకు జయంత్ కృష్ణతో కలిసి నకిలీ సరోగసీ రాకెట్‌ను నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో నమ్రతతో పాటు ఆమె సిబ్బందిలోని ఇతర సభ్యులు కూడా అరెస్టయ్యారు.
రాజస్థాన్ కు చెందిన ఒక జంట సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నుంచి సరోగసీ ద్వారా పొందిన శిశువు తమ జన్యుపరమైన బిడ్డ కాదని డీఎన్ఏ పరీక్షలో తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ జంట రూ. 35 లక్షలు చెల్లించినప్పటికీ, డా. నమ్రత డాక్యుమెంట్లు అందించడానికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తులో, నమ్రత వలస కార్మికులు, గర్భస్రావం కోరుకునే మహిళలను లక్ష్యంగా చేసుకొని, డబ్బు కోసం గర్భాలను కొనసాగించమని ప్రోత్సహించినట్లు తేలింది. ఈ నవజాత శిశువులను తమ సొంత బిడ్డలుగా చెప్పి ఖాతాదారులకు అందజేశారు.
ALSO READ : CM Revanth: BC రిజర్వేషన్.. ఖర్గేకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
పోలీసులు ఫెర్టిలిటీ సెంటర్‌పై దాడులు నిర్వహించి, 17 వీర్య దాతలు, 11 అండ దాతల సమాచారంతో పాటు అనధికార ఔషధాలు, అల్ట్రాసౌండ్ యంత్రాలు, లాపరోస్కోపిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లినిక్ జాతీయ లేదా రాష్ట్ర ART & సరోగసీ రిజిస్ట్రీలో నమోదు కానీ విషయం కూడా బయటపడింది. ఇది 2021 ART రెగ్యులేషన్ చట్టం కింద అక్రమంగా మారింది. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని ఇండియన్ స్పెర్మ్ టెక్ అనే సంస్థతో కలిసి వీర్యం, అండాలను అక్రమంగా రవాణా చేసినట్లు తెలిసింది.
ALSO READ : Kova Lakshmi: కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్ విసిరేసిన BRS ఎమ్మెల్యే
నమ్రత బ్యాంక్ ఖాతాలలో భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీటిపై ప్రస్తుతం పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నాంపల్లి కోర్టు డా. నమ్రతకు 5 రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది కాగా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.


