HYDRAA demolishes Illegal Constructions: హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై పంజా విసిరింది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల్లో భూములను కాపాడిన హైడ్రా.. తాజాగా మరో రూ. 139 కోట్ల విలువైన భూమికి విముక్తి కల్పించింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తెల్లవారుజామున పంజా విసిరింది. అక్రమ నిర్మాణాలను తొలగించింది. అలాగే బద్వేల్ – ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2 లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు సైతం హైడ్రా విముక్తి కల్పించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/hydra-demolishes-illegal-constructions-in-kondapur/
కబ్జాపై ప్రజావాణిలో ఫిర్యాదు: కబ్జాకు గురవుతున్న భూములపై జావాణిలో ఫిర్యాదు అందినట్టుగా హైడ్రా అధికారులు తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే కబ్జా జరిగినట్లు నిర్ధరించామని అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించిందని పేర్కొన్నారు. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్‌లు, రూమ్‌లను పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. అనంతరం ఫెన్సింగ్ నిర్మాణ పనులను చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు: ఈ భూమిని కొంతమంది కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఈ విషయమై హైకోర్టు తీర్పుల మేరకే హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టినట్టు తెలిపారు. భూ కబ్జా కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించేందుకే హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు.


