JEE మెయిన్ 2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థ మరోసారి సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు 300కి 300 మార్కులతో ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారు. వంగ అజరురెడ్డి, దేవ్‌దుత్త మాఝీ ఇద్దరూ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్‌ను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీచైతన్య అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తొలి 10 ర్యాంకుల్లో నలుగురు, 100లోపు 27 మంది, 1000లోపు 150 మందికి పైగా శ్రీచైతన్య విద్యార్థులే ఉన్నారని తెలిపారు. తోష్నివాల్ శివెన్ 9వ ర్యాంక్, సాక్షం జిందాల్ 10వ ర్యాంక్ సాధించారని వివరించారు.
అన్ని కేటగిరీలలో టాప్ 10లో 10 ర్యాంకులు దక్కించుకున్న ఏకైక సంస్థగా శ్రీచైతన్య రికార్డు సృష్టించిందని ఆమె చెప్పారు. ముఖ్యంగా వరుసగా మూడు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ద్వారా జెఇఇ మెయిన్‌లో 300కి 300 మార్కులతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ ఘనత శ్రీచైతన్యకే ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ అద్భుత ఫలితాల వెనుక సంస్థ రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామ్‌లు, మైక్రో షెడ్యూళ్లు, క్రమంగా నిర్వహించిన అంతర్గత పరీక్షలు, విశ్లేషణాత్మక ర్యాంకింగ్ విధానం, ఇన్ఫినిటీ లెర్న్, ఆన్‌లైన్ యాప్ వంటి వనరుల ప్రభావం ఎంతో ఉందని ఆమె వివరించారు. అంతేగాకుండా, విద్యార్థులతో అంకితభావంతో పనిచేసే ఫ్యాకల్టీ టీమ్ ఈ విజయాలకు కీలకమని కొనియాడారు.
ఈ విజయాన్ని అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించేందుకు విద్యాసంస్థ మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ సీమ ఇతర అధికారులు పాల్గొన్నారు.