Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Jubilee Hills By poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు...

Jubilee Hills By poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు

Jubilee Hills By poll Holiday on November 11th: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు వచ్చే నెల 11న నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/hyderabad-hash-oil-seizure-minor-drug-mule-arrested/

కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21 వరకు నామినేషన్లకు తుది గడువు కాగా.. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికలో గెలిచి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుని అధికార పార్టీకి గట్టి షాక్‌ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ సైతం గణనీయమైన ఓట్లను సాధించి గ్రేటర్‌లో తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏదేమైనా ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాలుగా మారింది.

Also Read: https://teluguprabha.net/telangana-news/government-announces-diwali-bonus-for-singareni-workers/

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది. ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 14న వెల్లడి కానుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad