Kishan Reddy Revanth War : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. BRS అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్టుల సంగతి పక్కన పెట్టి, ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయాలని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాటల తూటాలు విసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ బీఅర్ఎస్ నేతల అరెస్ట్ పై బీజేపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. “కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. వాటిని మరిచిపోయి ఇతర పార్టీలపై విరుచుకుపడుతుంది. ముందు మాటలు ఆపి హామీల సంగతి చూడండి” అంటూ సవాల్ విసిరారు. తమపై అనవసర ఆరోపణలు చేయడం మానుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని రేవంత్‌కు హితవు పలికారు.
“కాళేశ్వరం కేసుపై విచారణ మా ఎన్నికల హామీ కాదు. ముందు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి. ఆ తర్వాత మిగతా విషయాలు చర్చిద్దాం” అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల BRS నేతల అరెస్ట్ పై సవాల్ విసిరారు. “ఈ నెల 11వ తేదీలోగా కేసీఆర్, హరీశ్‌రావులను సీబీఐ కేసులో అరెస్ట్ చేయించండి” అని కిషన్‌రెడ్డిని సవాల్ చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడిచినా చర్యలు లేకపోవడాన్ని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి “సీబీఐ దర్యాప్తు స్వతంత్రంగా జరుగుతోంది. మీరు మీ హామీలపై చర్చించండి” అని స్పందించారు.
ఈ సవాల్ BRS-కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత పెంచింది. BRS “కాంగ్రెస్ మోసం” అని, కాంగ్రెస్ “BRS-బీజేపీ ఫిక్స్‌డ్ బంధం” అని ఆరోపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.


