Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్KTR: కాంగ్రెస్ పాలనలో నాసిరకం పనులు.. చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంపై కేటీఆర్ ఆగ్రహం

KTR: కాంగ్రెస్ పాలనలో నాసిరకం పనులు.. చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంపై కేటీఆర్ ఆగ్రహం

KTR: మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించిన చెక్ డ్యామ్‌ కేవలం రెండు నెలల్లోనే కొట్టుకుపోవటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణ పనుల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు.

- Advertisement -

ఎస్ఎల్‌బీసీ సొరంగం తవ్వటం చేతకాదు, సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు. చివరికి ఒక చిన్న చెక్ డ్యామ్‌ను కూడా సరిగా నిర్మించలేని కాంగ్రెస్ నేతలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద చల్లడం సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన ఈ చెక్ డ్యామ్ కొట్టుకుపోవడానికి కారణమేంటో సీఎం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నాసిరకం పనుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిర్మాణ రంగంలో నాణ్యతా లోపాలను స్పష్టంగా చూపిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రత, నిర్మాణ నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే, భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన అంటేనే మొద్దు నిద్ర ప్రభుత్వమని విమర్శించారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad