Hyderabad weather report: హైదరాబాదులోని పలుప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్‍సుఖ్‍నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతోంది. అల్పపీడనం ప్రభావంతో నగర వ్యాప్తంగా మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నగరం మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ ప్రజలకు సూచన: వాతావరణం అకస్మాత్తుగా మారడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పగటిపూట వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం తర్వాత వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా ఉండేందుకు సాయంత్రం లోపు ఇళ్లకు చేరుకోవడం మంచిదని తెలిపారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rain-warnings-issued-for-cyclone-ap/
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పాత, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున.. ప్రజలు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని తెలిపారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: వర్షాలు పడిన ప్రతిసారి రేవంత్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూనేఉంది. ప్రస్తుతం కూడా కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు


