GHMC Litter Picker Machines: జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్లపై చెత్తను శుభ్రం చేసేందుకు నిత్యం కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉపశమనం లభించనుంది. రోడ్లపై చెత్తను శుభ్రంగా, త్వరగా ఏరిపారేసేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తోడుగా అధునాతన మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ లిట్టర్ పికర్ మెషీన్లు ఇకపై నగరంలోని రోడ్లను శుభ్రం చేసేందుకు వినియోగించనున్నారు.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సిబ్బందికి చేదోడుగా నిలిచేందుకు ఆరు సరికొత్త ఎలక్ట్రిక్ లిట్టర్ పికర్ మెషీన్లు రంగంలోకి దిగాయి. ఇన్‌ఆర్బిట్‌మాల్, ఎన్జీఓ సంస్థ నిర్మాన్ సంయుక్తంగా స్పార్క్‌లింగ్ సైబరాబాద్ పేరుతో రహదారులను శుభ్రంగా ఉంచేందుకు ఈ మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/kutbullapur-brave-girl-chases-thief/
ఎలక్ట్రిక్ లిట్టర్ పికర్ మెషీన్ల సాయంతో రోడ్లపై పొడిచెత్తను సులభంగా తొలగించవచ్చు. ఒకేసారి 240 లీటర్ల చెత్తను సులభంగా తీసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యాటరీతో పనిచేసే ఈ యంత్రాలను ఒకసారి 5 గంటల ఛార్జింగ్ చేస్తే రోజంతా పనిచేస్తాయని వెల్లడించారు. లిట్టర్ పికర్ మెషీన్లు పర్యావరణ అనుకూలంగా పనిచేయడంతో పాటు చెత్తను సేకరించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.


