Friday, February 21, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Manchu Manoj: మంచు మనోజ్ కు ఏమైంది.. పీఎస్ లో సీఐతో గొడవ

Manchu Manoj: మంచు మనోజ్ కు ఏమైంది.. పీఎస్ లో సీఐతో గొడవ

మంచు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. వీరి కుటుంబ గొడవలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ తీరు చర్చనీయాంశం అవుతోంది. కుటుంబ మనస్పర్థలు, ఆస్తి తగాదాలతో అన్న, తండ్రితో గొడవలతో మంచు మనోజ్ ప్రవర్తన వింతగా అనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం రాత్రి భాకరాపేట పీఎస్ లో మనోజ్ నానా యాగీ చేశారు. పోలీసులు తనను వెంబడిస్తున్నారని, నిఘా పెట్టారని.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ హంగామా చేశాడు. దీంతో పోలీసులు చికాకు కలిగింది.

- Advertisement -

అసలు ఏమైంది: పోలీసుల తీరుపై తాజాగా మంచు మనోజ్ అనుమానం వ్యక్తం చేశాడు. సోమవారం అర్ధరాత్రి హల్‌చల్ చేశాడు. భాకరాపేట పీఎస్ కు ఆయన రావడం కలకలం రేపింది. భాకరాపేట ఘాట్ రోడ్డులో ఉన్న లేక్ వ్యాలీ రిసార్ట్స్‌లో మనోజ్ కుమార్ బస చేశారు. ఎస్ఐ రాఘవేంద్ర రాత్రి 11 గంటల సమయంలో గస్తీ నిర్వహణలో భాగంగా రిసార్ట్ వద్దకు వెళ్లి ఎవరెవరున్నారు అని విచారించారు. మనోజ్ ఉన్నాడని సిబ్బంది చెప్పారు.

సరిగ్గా అదే సమయంలో మంచు మనోజ్ ఎస్ఐ వద్దకు వచ్చి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అందుకు పోలీసులు సమాధానం ఇచ్చారు. సెలబ్రిటీ అయిన మీరు దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదని ఎస్ఐ చెప్పారు. అయితే తాను రిసార్ట్‌లో ఉంటే సైరన్ ఎందుకు వేస్తారని.. తన ప్రైవసీని ఎందుకు డిస్ట్రబ్ చేస్తారని మనోజ్ ఎస్ఐని ప్రశ్నించారు.

అనంతరం నేరుగా భాకరాపేట పీఎస్ కు చేరుకున్న మనోజ్.. సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో వాదనకు దిగారు. సీఎం పేరుతో తనను, తన అనుచరులను బెదిరిస్తున్నారని, సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టించుకుంటారని నిలదీశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయం దగ్గరున్న షాపులను ధ్వంసం చేస్తే మాత్రం పోలీసులు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అర్ధరాత్రి తర్వాత కూడా పోలీస్ స్టేషన్లోనే బైఠాయించిన మనోజ్ తనను ఎందుకు వెంబడిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News