హైదరాబాద్ కూకట్ పల్లి జోన్.. కూకట్ పల్లి, మూసాపేట సర్కిల్ లో గల పలు డివిజన్ ల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికక్కడే పరిష్కారం చేయాలని అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. మౌళిక సదుపాయాలు, అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
బాలానగర్ డివిజన్ లో వినాయకనగర్, రాజీవ్ గాంధీ నగరాల్లో గల నాల పనులను పరిశీలన ప్రమాదాలు సంభవించకుండా భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా.. చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అల్లపూర్ డివిజన్ లో పలు పనులకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. సఫ్దర్ నగర్ సీవారేజ్ లైన్, రోడ్డు కు , రాజీవ్ గాంధీ నగర్ సి బ్లాక్ లో సివరేజ్ పనులకు, కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ సర్వీనంబర్ 18 స్థలంలో నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగు అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. క్యూబా మజీద్ వద్ద మురికి నీరు కాల్వ పనులకు కూడా ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. ఈ సందర్బంగా స్థానికులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం పట్ల ఎవరూ ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజల ఆరోగ్యం, భత్రతే ముఖ్యంగా పనిచేయాలని మేయర్ అన్నారు.