Minister Ponnam Letter to Rajnath Singh: హైదరాబాద్‌లో ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న జంటనగరాల్లో ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చేందుకు భూములు అవసరమని.. ఈ అంశాన్ని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/international-news/pakistan-bomb-blast-died-9-people/
లేఖలో పేర్కొన్న అంశాలు ఇవే..
‘కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను సకాలంలో చెల్లించినట్లయితే రక్షణ శాఖ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమవుతుంది. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ శాఖ భూములను ఇవ్వాలని.. ఈ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’
Also Read: https://teluguprabha.net/international-news/donald-trump-new-rules-for-universities/
గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగడం లేదనే అంశంపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ తగిన పరిశీలన చేస్తుందని పొన్నం లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి పొన్నం అందజేశారు.


