Saturday, May 24, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్నన్ను వేశ్యలా చూస్తున్నారు.. మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాండ్..!

నన్ను వేశ్యలా చూస్తున్నారు.. మిస్ వరల్డ్ పోటీల నుంచి వైదొలగిన మిస్ ఇంగ్లాండ్..!

ప్రపంచమంతటా గ్లామర్, గౌరవం కలిగిన పోటీలుగా భావించే మిస్ వరల్డ్ వేదికపై ఈసారి సంచలనం చోటు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా పోటీలో నుంచి వైదొలగడం కలకలం రేపుతోంది. శారీరక సౌందర్యానికి మించిన విలువల కోసం వచ్చిన ఈ యువతి, అక్కడ తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.

- Advertisement -

24 ఏళ్ల మిల్లా, మిస్ ఇంగ్లాండ్ కిరీటం గెలిచి మిస్ వరల్డ్ పోటీ కోసం భారత్‌కు వచ్చింది. కానీ పోటీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఆమె తీవ్ర అసంతృప్తికి గురైంది. “మమ్మల్ని మనిషులుగా కాకుండా ప్రదర్శన కోసం కూర్చోబెట్టిన కోతుల్లా చూస్తున్నారు,” అంటూ బాధను వ్యక్తపరిచింది. కార్యక్రమాల్లో భాగంగా పోటీదారులను మేకప్, డిజైనర్ గౌన్లతో రోజంతా ముస్తాబుచేసి, హోటళ్లలో, స్పాన్సర్లకు నచ్చేలా ప్రదర్శన చేయిస్తున్న తీరును ఆమె తీవ్రంగా విమర్శించింది.

“నాకు తెలియదు, ఇది ఒక అందాల పోటీనా, లేక ఒక వినోద కార్యక్రమమా. అక్కడ మన అభిప్రాయాలు, ఉద్యమాలు, వ్యక్తిత్వం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను ఇలా ముసుగు వేసుకుని నడవడానికి రాలేదు,” అంటూ ఆవేదనతో తెలిపారు. ఆమె మాటల్లో, ఇది ఇంకా పాతకాలపు దృక్పథంతో నడుస్తున్న పోటీ అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నిర్ణయాన్ని బ్రిటిష్ మీడియా తీవ్రంగా విశ్లేషిస్తుండగా, మిల్లా స్థానంలో మిస్ లివర్‌పూల్ అయిన షార్లెట్ గ్రాంట్ ఫైనల్‌కు ఎంపికయ్యారు. ఈ వేదిక నుండి మిల్లా తప్పుకోవడం ఆమె వ్యక్తిగత నైతిక విలువలకు ఇచ్చిన ప్రాధాన్యతగా పేర్కొంటున్నారు.

మిస్ ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆంజీ బీస్లీ స్పందిస్తూ, “ఆమె ఆరోగ్యం, నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని.. మద్దతు తెలిపారు. ఇక మిల్లా, ప్లస్-సైజ్ మోడల్‌గా ఈ పోటీలో పాల్గొన్న తొలి బ్రిటిష్ ఎంట్రీ. ఆమెను బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్ విలియం స్వయంగా ప్రోత్సహించాడన్న విషయమూ ప్రస్తుతం హైలైట్ అవుతోంది. ఈ సంఘటనతో అందాల పోటీల భావనపై ప్రపంచం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా “అందం” అంటే ఏమిటన్న ప్రశ్న మళ్లీ వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News