Saturday, April 19, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Mukunda Jewellers : చందానగర్‌లో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ప్రారంభించిన ముకుంద జ్యువెలర్స్..!

Mukunda Jewellers : చందానగర్‌లో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ప్రారంభించిన ముకుంద జ్యువెలర్స్..!

ముకుంద జ్యువెలర్స్‌ తమ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్‌లెట్‌ను.. హైదరాబాద్ లోని చందానగర్‌లో ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే ఖమ్మం, కొత్తపేట, హనుమకొండ, సోమాజిగూడ, సుచిత్ర, కేపీహెచ్‌బీలో తమ బ్రాంచ్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయని, వినియోగదారుల నుండి మంచి స్పందన రావడం వల్లే ఇప్పుడు చందానగర్‌లో 7వ బ్రాంచ్‌ను ప్రారంభించామని తెలిపారు.

- Advertisement -

తక్కువ ధరలతో, ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా ముకుంద జ్యువెలర్స్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉండబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల సౌలభ్యం కోసం సులభమైన నెలవారీ వాయిదాల పద్ధతిలో జ్యువెలరీ కొనుగోలు చేసేందుకు ప్రత్యేక స్కీమ్స్‌ను కూడా ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అత్యంత విశేషంగా, గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ను మార్కెట్లో తాము వినూత్నంగా ప్రవేశపెట్టామని నరసింహ రెడ్డి తెలిపారు.

బ్యాంకుల్లో లాకర్లలో కాకుండా, ముకుంద జ్యువెల్స్‌ వద్దే బంగారాన్ని డిపాజిట్‌ చేయడం ద్వారా ఆరు నెలల తర్వాత పెరిగిన విలువ మేరకు బంగారం తీసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వినియోగదారుల విశ్వాసం తమకు బలమని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News