Sunday, April 20, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్యశోద హాస్పిటల్స్ లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసుకుని పునర్జన్మ పొందిన పేషెంట్ల ఆత్మీయసమ్మేళనం..!

యశోద హాస్పిటల్స్ లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసుకుని పునర్జన్మ పొందిన పేషెంట్ల ఆత్మీయసమ్మేళనం..!

హైదరాబాద్, ఏప్రిల్ 20, 2025: అవయవ మార్పిడి చేసుకున్న వారి జీవనశైలి, ముఖ్యంగా కిడ్నీ మార్పిడి చేసుకున్న తరువాత వారి జీవనశైలి ఎలా ఉంటుంది, ట్రాన్స్ ‌ప్లాంట్ కు ముందు వారు అనుభవించిన ఆనారోగ్య సమస్యలు.. అవయవ మార్పిడి తరువాత వారు అనుభవిస్తున్న (క్వాలిటీ లైఫ్) మెరుగైన జీవన విదానం ఎలా ఉంటుదనేదానిపై ఇప్పుడు ట్రాన్స్ ‌ప్లాంట్‌ చేయించుకునేoదుకు సిద్దంగా ఉన్నవారు పడే ఆందోళన, అపోహలను తొలగించి “అవయవ మార్పిడి” జీవితాలను ఎలా కాపాడుతుందో చూపించే అవగాహనా కార్యక్రమాన్ని ఈ రోజు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ‌ప్లాంట్స్, కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్ మరియు కిడ్నీ వారియర్స్ ఫౌండేషన్ సహకారంతో “సెలబ్రేటింగ్ సెకండ్ ఛాన్సెస్ – లైఫ్ విత్ కిడ్నీ ట్రాన్స్ ‌ప్లాంట్ పేషెంట్స్” పేరిట ఆత్మీయసమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.

- Advertisement -

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, మాట్లాడుతూ.. భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం పెరుగుతోంది, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు, వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అందించబడుతుంది. మిగిలిన వారు డయాలసిస్ ‌లో ఉండి, మార్పిడి కోసం వేచి ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో CKD “క్రానిక్ కిడ్నీ డిసీజ్” ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నయన్నారు. తీవ్రమైన కిడ్నీ గాయం నుండి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి పురోగతిని నివారించడానికి ముందస్తుగా గుర్తించడం, నివారణ వ్యూహాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, నొక్కి చెప్పారు.

యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.యస్. రావు మాట్లాడుతూ… యశోద హాస్పిటల్స్ ‌లో అధునాతన సాంకేతికత మరియు నిపుణులైన బహుళ వైద్య విభాగల ద్వారా ప్రపంచ స్థాయి మూత్రపిండాల సంరక్షణను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. విజయవంతమైన మూత్రపిండాల మార్పిడి, రోగ నిర్ధారణ నుండి పునరావాసం వరకు మా సమగ్ర సంరక్షణ రోగి సాధికారత మరియు సమాజ అవగాహన పట్ల మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. మూత్రపిండాల సంరక్షణ ఫలితాలను మరియు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోగులు మరియు డయాలసిస్ సాంకేతిక నిపుణులకు నిరంతర నైపుణ్య మెరుగుదల విద్యకు ఆసుపత్రి నిబద్ధతను డాక్టర్. జి.యస్. రావు అభినదించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి 280 మంది కిడ్నీ మార్పిడి గ్రహీతలు, డయాలసిస్ రోగులు, కిడ్నీ దాతలు మరియు డయాలసిస్ టెక్నీషియన్లు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News