Purvi Gold & Diamonds Opening in KPHB Hyderabad: భాగ్యనగర వాసుల కోసం మరో నగల షోరూం అందుబాటులోకి వచ్చింది. బంగారు ఆభరణాల్లో ఆకర్షణీయమైన కలెక్షన్లు, అధునాతన మోడల్స్‌తో పాటు డైమండ్ ఆభరణాలతో మరో షోరూం కొలువు దీరింది. ముకుంద వారి ఆధ్వర్యంలో ‘పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్’ షోరూంను హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/ex-soldier-kadam-ramesh-two-retirements-army-sbi/
కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్ నెంబర్ 4లో పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్, సిల్వర్ పేరుతో శనివారం షో రూం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో సంస్థ సీఈఓ నిఖితా రెడ్డి, డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష బాబురావు రిబ్బన్ కటింగ్ చేసి షోరూంని ప్రారంభించారు.

ముకుంద జ్యువెల్లరీపై చూపిన ప్రేమ, విశ్వాసానికి వినియోగదారులకు సీఈఓ నిఖితా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘పూర్వీ’ పేరిట గోల్డ్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా డిజైన్‌లను బడ్జెట్‌లో అందించే దిశగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇక పూర్వీ జ్యువెలరీలో 18, 22, 24 క్యారెట్లలో ఆధునిక డిజైన్స్‌తో పాటు నూతన డైమండ్ కలెక్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-railway-tracks-flooding-montha-cyclone/
కాగా, పూర్వీ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రూ. 3 లక్షల విలువైన కొనుగోళ్లపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా పూర్వీ షోరూం ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్స్‌కు తీపికబురు అందించారు. నవంబర్ 1 నుంచి 3 వరకు తేదీల్లో కొత్త షోరూమ్‌ను సందర్శించిన మొదటి 1000 మంది ఫాలోవర్లకు 5 గ్రాముల వెండి కాయిన్ బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కస్టమర్లు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ నరసింహారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.


