R&B Engineers Met Minister Komatireddy Venkat Reddy: ఇటీవల ఎన్నికైన ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని హైదరబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పూర్తి పారదర్శకతో ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాలు శాఖలో పదోన్నతులు కల్పించామి మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్ అప్రూవల్ చేసుకొని రెగ్యులర్ ప్రమోషన్స్ వచ్చేలా కృషి చేశానని పేర్కొన్నారు. ‘ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 118 మంది AEE లు డీఈలుగా పదోన్నతి పొందారు. అదేవిధంగా 72మంది డీఈలు ఈఈ లగా, 29 మంది ఈఈలు ఎస్‌ఈలు, ఎస్ఈలు సీఈలుగా ఆరుగురు, సీఈ నుంచి ఈఎన్సీగా ఇద్దరు ప్రమోషన్స్ పొందారు.’ అని మంత్రి వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cpi-narayana-slams-kcr-jagan-assembly-boycott/
పదోన్నతులు పొందిన వారంతా మరింత ఉత్సాహంతో పని చేస్తారని విశ్వసిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. శాఖాపరంగా ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇతర కేడర్లలో మిగిలిన పదోన్నతులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల్లో ఆర్‌అండ్‌బీ శాఖకు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత శాఖా ఇంజినీర్లపైనే ఉందని స్పష్టం చేశారు.
మంత్రిని కలిసిన వారిలో ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్. శ్రీను, జనరల్ సెక్రటరీ బి. రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. శరత్ చంద్ర, ట్రెజరర్ మహేందర్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు కె.సంధ్య, వేణు, ప్రదీప్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీలు నవీన్, కిషన్, అరుణ్ రెడ్డి పలువురు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఉన్నారు.


