Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్IT Raids : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్ఆర్ గ్రూప్‌పై...

IT Raids : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్ఆర్ గ్రూప్‌పై కూడా!

IT Raids : హైదరాబాద్‌లో మాజీ ఎంపీ జి. రంజిత్ రెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో రంజిత్ రెడ్డి లావాదేవీలపై ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులలో సుమారు 30 ప్రాంతాల్లో 15 బృందాలు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లోని డీఎస్ఆర్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, సూరారం, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

ALSO READ: Tollywood Movies: హీరో చనిపోతే సినిమా హిట్టు..

డీఎస్ఆర్ గ్రూప్ సీఈవో సత్యనారాయణ రెడ్డి, ఎండీ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా సంస్థ చేసిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు, బకాయిలపై ఐటీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సోదాలు ఉదయం 5 గంటల నుంచి సీఆర్‌పీఎఫ్ భద్రత మధ్య కొనసాగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రంజిత్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.

రంజిత్ రెడ్డి గత ఎన్నికల్లో రూ. 435 కోట్ల ఆస్తులు డిక్లేర్ చేసి, దేశంలోనే అత్యంత ధనవంతులైన ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. 1988లో స్థాపితమైన డీఎస్ఆర్ గ్రూప్ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సోదాలు ఆర్థిక అక్రమాలు, పన్ను ఎగవేత ఆరోపణలపై దృష్టి సారించాయి. ఈ ఘటన రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad