Resplice Autism Therapy Camp Hyderabad : ఆటిజం అనేది పిల్లల జీవితాల్లో పెద్ద సవాలుగా మారుతోంది. ఇది గర్భధారణ సమయంలోనే మొదలవుతుందని, ముందే చర్యలు తీసుకుంటే దాన్ని అడ్డుకోవచ్చని డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని రెస్ప్లైస్ ఆటిజం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్, ఆటిజం బాధిత పిల్లలకు గట్-బ్రెయిన్ యాక్సిస్‌ను సరిచేసే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT) థెరపీని అందించడంలో భారతదేశంలో మొదటి సంస్థగా నిలుస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్, అక్టోబర్ 29, 2025 నుంచి నవంబర్ 15, 2025 వరకు మణికొండలో ఉచిత అసెస్‌మెంట్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యాంప్‌లో ఆటిజం బాధితులకు పూర్తి పరీక్షలు, సలహాలు ఉచితంగా లభిస్తాయి.
డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి – ఒక వైద్యుడు, తండ్రి, పరిశోధకుడు
వృత్తిపరంగా కార్డియాలజిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి (MBBS, PGDCC, FMAPS), 2015లో జన్మించిన తన కూతురులో ఆటిజం ఉందని తెలిసిన తర్వాత తన వృత్తిని మార్చుకున్నారు. అమెరికాలో స్పెషల్ నీడ్స్ ఫెలోషిప్ చేసి, గట్-బ్రెయిన్ కనెక్షన్‌పై పరిశోధనలు చేశారు. తన కూతురులో గట్ సంబంధిత సమస్యలు, అలర్జీలు, ప్రవర్తనా లోపాలు గమనించి, సాంప్రదాయ వైద్యంలో రావని మూల కారణాలు వెతికారు. 2022 ఆగస్టులో హైదరాబాద్‌లో రెస్ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఇక్కడ పేగు (గట్) మైక్రోబయోమ్‌పై దృష్టి పెట్టి, ఆటిజం లేని తరాన్ని సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వారికి అటల్ అచీవ్‌మెంట్ అవార్డ్, గ్లోబల్ హెల్త్‌కేర్ అచీవ్‌మెంట్ అవార్డ్‌లు లభించాయి. 2025లో “రీబిల్డింగ్ ఫ్రమ్ రూట్ – ఎన్విరాన్‌మెంట్, మైక్రోబయోమ్ & ఆటిజం” అనే పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు.
ఆటిజం – గట్ మైక్రోబయోమ్
గత 4-5 దశాబ్దాలుగా ఆటిజం కేసులు భారీగా పెరిగాయి. ఇందుకు పర్యావరణ విషాలు, గర్భధారణ సమయంలో ఎపిజెనెటిక్ మార్పులు, గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ప్రధాన కారణాలు. రెస్ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనల ప్రకారం, ఆటిజం బాధిత పిల్లల్లో మంచి బ్యాక్టీరియా తక్కువగా, చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. ఇది మెదడుకు సిగ్నల్స్ పంపి ప్రవర్తన, నిద్ర, నడవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. 2017 నుంచి సాగిన పరిశోధనల్లో రెండు ప్రధాన ఆవిష్కరణలు వచ్చాయి. అవి 1) FMT ద్వారా గట్ మైక్రోబయోమ్‌ను సరిచేయడం, 2) గర్భధారణ ముందు విషరహిత వాతావరణం సృష్టించడం ద్వారా ఆటిజం నివారణ.
FMT థెరపీ.. ఆటిజంకు కొత్త పరిష్కారం
ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT) అంటే ఆరోగ్యకరమైన దాతల నుంచి మంచి బ్యాక్టీరియాను రోగి గట్‌లోకి బదిలీ చేయడం. ఇది మలబద్ధకం, ఉబ్బరం, ఆహార అసహనం వంటి గట్ సమస్యలను సరిచేస్తుంది. ఆటిజం బాధిత పిల్లల్లో 30-40% మెరుగుదల కనిపిస్తుందని పరిశోధనలు చూపాయి. ఇది 3-17 సంవత్సరాల పిల్లలు, పెద్దలు, క్యాన్సర్ రికవరీలో గట్ డ్యామేజ్ ఉన్నవారికి అందుబాటులో ఉంది. రెస్ప్లైస్ ఇన్‌స్టిట్యూట్, భారతదేశంలో మొదటి స్టూల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, AI ఆధారిత మల్టీ-ఓమిక్స్ పరీక్షలతో వ్యక్తిగత చికిత్సలు అందిస్తోంది. ICMR అనుమతితో 2022 ఫిబ్రవరి నుంచి 100 మంది పిల్లలపై మూడేళ్ల అధ్యయనం సాగుతోంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది.
ఆటిజం నివారణకు స్మార్ట్ క్లాన్ ప్రోగ్రామ్
ఆటిజం గర్భం దాల్చిన మొదటి రోజుల్లోనే ప్రారంభమవుతుందని రెస్ప్లైస్ పరిశోధనలు నిర్ధారించాయి. దీనికి పరిష్కారంగా ‘స్మార్ట్ క్లాన్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టారు. ఇది భారతదేశంలో మొదటి ఆటిజం నివారణ కార్యక్రమం. ప్రీ-మ్యారిటల్ బయోలాజికల్ మ్యాచింగ్, ప్రీకాన్సెప్షన్ డిటాక్స్, గట్ మరియు యూటరైన్ మైక్రోబయోమ్ ఆప్టిమైజేషన్, జెనెటిక్ స్క్రీనింగ్‌లతో పనిచేస్తుంది. గర్భిణులకు N-ఎసిటైల్ సిస్టీన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఇచ్చి, ప్లాస్టిక్‌లు, పురుగుమందులు, కెమికల్స్ నుంచి దూరంగా ఉంచి, సేంద్రీయ ఆహారం ప్రోత్సహిస్తారు. ఇది ఆటిజం, ఇతర జెనెటిక్ రిస్క్‌లను 70-80% తగ్గిస్తుందని అంచనా.
టీమ్‌లో బాధిత తల్లిదండ్రులు
రెస్ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌ను వైద్యులు మాత్రమే కాకుండా, ఆటిజం బాధిత పిల్లల తల్లిదండ్రులు కలిసి నడుపుతున్నారు. అమెరికాలో డెంటల్ ప్రాక్టీస్ చేసిన డాక్టర్ కళారమ్య మారేపల్లి (CSO), తన 7.5 సంవత్సరాల కుమారుడి కోసం అంతా వదిలి భారత్‌కు వచ్చి, FMT చికిత్స తీసుకున్న తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. డాక్టర్ చంద్రశేఖర్ రావు (ఓరల్ సర్జన్), డాక్టర్ మురళి మోహన్ రెడ్డి (ఎథిక్స్ కమిటీ) వంటి నిపుణులు కూడా భాగస్వాములు. ఇది తల్లిదండ్రుల నమ్మకాన్ని సైతం పెంచుతోంది.
ఉచిత అసెస్‌మెంట్ క్యాంప్ వివరాలు
ఆక్టోబర్ 29, 2025 నుంచి నవంబర్ 15, 2025 వరకు మణికొండ, శివపురి కాలనీ, విజేత సూపర్ మార్కెట్ 3వ అంతస్తులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాంప్ నిర్వహిస్తారు. ఆటిజం బాధితులకు పూర్తి అసెస్‌మెంట్, సలహాలు, అవగాహనా సెషన్‌లు ఉచితం. రిజిస్ట్రేషన్ కోసం 91000 65552కి కాల్ చేయండి. ఇన్‌స్టిట్యూట్ వివరాలకు respliceinstitute.com సందర్శించండి.
రెస్ప్లైస్ ఇన్‌స్టిట్యూట్, ఆటిజం చికిత్స, నివారణలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తోంది. మీ పిల్లల భవిష్యత్తును రక్షించాలంటే, ఈ అవకాశాన్ని మిస్ చేయకండి.


