Sai Durga Tej Donation to Police: సినీ నటుడు సాయి దుర్గా తేజ్ మానవత్వం చాటుకున్నారు. తెలంగాణలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌మెంట్‌కు రూ. 5 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు గురువారం ‘హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్డు, సేఫ్టీ సమ్మిట్ 2025’కి హాజరైన సాయి దుర్గా తేజ్.. పోలీసు అధికారులకు చెక్కు అందజేశారు. ఈ మేరకు తనకు గతంలో జరిగిన ప్రమాదాన్ని ఈ మెగా హీరో గుర్తు చేసుకుని.. వాహనదారులకు పలు సూచనలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/bathukamma-festival-in-guinness-book/
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సాయి దుర్గా తేజ్ విజ్ఞప్తి చేశారు. 2021 సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు రెండు వారాల పాటు కోమాలో ఉన్నట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఇప్పుడిది నాకు పునర్జన్మ. సానుభూతి కోసం నేను ఇదంతా చెప్పడం లేదు. ఆ రోజు నేను హెల్మెంట్ ధరించాను కాబట్టే.. ఈ రోజు నేను మీ మధ్య ఉన్నా. బైక్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.’ అని సాయి కోరారు.


