చీర కట్టు లోన స్త్రీ అందంగా కనిపిస్తుందని.. మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ హైదరాబాద్లో ప్రప్రథమంగా సారీ డాపింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. గురువారం ఉదయం హైదరాబాద్ వనస్థలిపురం లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో… చెన్నైకి చెందిన ప్రముఖ సారీ డాపర్ కవిత ఆధ్వర్యంలో మొదటి సారిగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.
భారతీయ సంస్కృతిలో మహిళా అందాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వస్త్రధారణ చీర. ఇది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాకుండా, ఒక సంప్రదాయం, ఒక గుర్తింపు. చీరకట్టులో ఉన్న మహిళకు ఒక ప్రత్యేకమైన శోభ, గౌరవం, మర్యాద కనిపిస్తాయి. వేదకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు చీర తన ప్రత్యేకతను కోల్పోలేదు. వివాహాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకట్టును అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మాంగళ్య షాపింగ్ మాల్స్ వారు కూడా దీనినే ఫాలో అవుతున్నారు.
సారీ డాపింగ్ కార్యక్రమంలో భాగంగా చీరకట్టు ఎలా ఉండాలలో.. దానిని కట్టుకునే నైపుణ్యాన్ని సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమం లో హైదరాబాద్ నగరం లోని ఫ్యాషన్ డిజైనర్స్ బ్యూటీ పార్లర్ ప్రముఖులు ఎంతో ఆసక్తి గా తిలకించారు. ఈ సందర్భంగా మాంగళ్య యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో మాంగళ్యషాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ, డైరెక్టర్స్ కాసం శివ, పుల్లూరు అరుణ్ ,తోనూపునూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.