SBI Swachhata HI Seva 2025: స్వచ్ఛతా హి సేవ (SHS) 2025 ప్రచారంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్‌లోని స్థానిక ప్రధాన కార్యాలయం (LHO), సుల్తాన్ బజార్, గుజరాతీ గల్లీలలో శుభ్రతా కార్యకలాపాలను నిర్వహించింది. “ఏక్ దిన్ – ఏక్ ఘంటా – ఏక్ సాత్” థీమ్‌తో ఈ కార్యక్రమం జరిగింది. ఇది పరిశుభ్రమైన సమాజ సృష్టికి SBI చేపట్టిన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
సుల్తాన్ బజార్, గుజరాతీ గల్లీలోని రద్దీ వాణిజ్య ప్రాంతాల్లో శుభ్రతా డ్రైవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్. రాధాకృష్ణన్ నాయకత్వం వహించారు. జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, శుభ్రపరిచే కార్మికులు, భద్రతా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ప్రజా స్థలాల్లో పరిశుభ్రత ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పరిశుభ్రత కేవలం శుభ్రం చేయడం గురించి మాత్రమే కాదు, ఇది మన విలువలు, క్రమశిక్షణ, నాయకత్వానికి ప్రతీక అన్నారు. “మన శాఖల చుట్టూ ఉన్న ప్రాంగణం శుభ్రంగా, స్వాగతించేలా ఉండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, చక్కని ATM గదులు, చక్కని సంకేతాలు మన బాధ్యత” అని పేర్కొన్నారు. శుభ్రపరిచే సిబ్బంది సేవలను గుర్తించి, వారిని “సూపర్ హీరోలు”గా ప్రశంసించారు. పరిశుభ్రతను ఒక రోజు కార్యక్రమంగా కాకుండా, నిరంతర పాటిస్తూ పరిసరాలను మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక SHS 2025 ప్రచారం క్లీన్ టార్గెట్ యూనిట్లు (CTUలు), క్లీన్ పబ్లిక్ స్పేస్‌లు, సఫాయిమిత్ర సురక్ష శిబిరాలు, క్లీన్ గ్రీన్ ఫెస్టివిటీస్, స్వచ్ఛత కోసం అడ్వకసీ అనే ఐదు ముఖ్య విషయాలపై దృష్టి సారించింది. సఫాయిమిత్రుల సేవలను గౌరవిస్తూ, వారి కృషికి గుర్తింపుగా రాధాకృష్ణన్ ప్రశంసలు అందజేశారు. ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్‌కు SBI ఇచ్చే విలువను ప్రతిబింబిస్తుంది. పరిశుభ్రతను గర్వంతో, బాధ్యతతో నిరంతరం కొనసాగించాలని ప్రోత్సహించింది.


