Wednesday, March 19, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ సంఘాల నాయకులు.. ఎందుకంటే..?

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మాదిగ సంఘాల నాయకులు.. ఎందుకంటే..?

దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న మాదిగ, మాదిగ ఉప కులాల కల నిజమైంది. ఈ సందర్భంగా మాదిగ సంఘాల నాయకులు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు బుధవారం అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులుగా విభజించి అమలు చేసే బిల్లుకు అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. త్వరలోనే గవర్నర్ గారి ఆమోదంతో ఈ బిల్లు చట్టం అవుతుందని చెప్పారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కోరికను 6 నెలల్లోనే నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తన తోటి మంత్రులకు, బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలిపారు.

అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఈ చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ కోసం పోరాడిన వారిని మాదిగ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రిగారు సభలో ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. వర్గీకరణ అంటే విడిపోవడం కాదని, సమానత్వం కోసం అందరూ కలిసి పనిచేయడమేనని మంత్రి అన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News