Sunday, November 16, 2025
HomeTop StoriesHyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వేగం పుంజుకోనున్న రెండో దశ మెట్రో పనులు!

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. వేగం పుంజుకోనున్న రెండో దశ మెట్రో పనులు!

Second phase Metro work: హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందజేసింది. రెండో దశ మెట్రో కారిడార్లను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోగా కొన్ని కారిడార్ల పనులను పూర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉంది. మొత్తం 162.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కారిడార్ల నిర్మాణానికి రూ.43,847 కోట్ల వ్యయం అవుతున్నట్లు రాష్ర్ట ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నిర్మాణానికి 48 శాతం రుణాలను అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా 2–4 శాతం వడ్డీతో సేకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సావరీన్ గ్యారంటీతో పాటు 18 శాతం నిధులు సైతం సమకూర్చనుంది. ప్రతి కారిడార్‌ను వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేర్వేరుగా టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒక్కో కారిడార్‌ను ఒక్కో నిర్మాణ సంస్థకు అప్పగిస్తే పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

ఎన్నికల నాటికి పూర్తికానున్న చిన్న కారిడార్లు: ఎల్బీనగర్–హయత్‌నగర్ (7.1 కి.మీ), రాయదుర్గం–కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ), ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ) వంటి చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. రెండో దశ ప్రాజెక్టులో భాగమైన ఓల్డ్‌సిటీ కారిడార్‌కు సంబంధించి ఆస్తుల సేకరణ 65 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా మిగతా ఆస్తుల స్వాధీనం కూడా పూర్తి చేసి టెండర్ పిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/jubilee-hills-congress-ticket-goes-to-bc-candidate/

తగ్గనున్న మెట్రో డిపోలు: రెండో దశలో కొత్తగా ఐదు కారిడార్ల కోసం ఇప్పటికే ఉన్న ఉప్పల్, మియాపూర్ డిపోలను వినియోగించాలని ప్రభుత్వం చూస్తుంది. దీంతో కొత్త డిపోల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీతోపాటుగా ప్యారడైజ్–మేడ్చల్, ప్యాట్నీ–శామీర్పేట్ మార్గాలకు మాత్రమే కొత్త డిపోలు నిర్మిస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఆపరేషన్స్, మెయింటెనెన్స్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గల పలు మెట్రోరైళ్ల సేవలను నిర్వహిస్తోంది.

అంతకు మించిన గుడ్ న్యూస్ మరోటి లేదు: ఎల్అండ్‌టీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. కియోలిస్ 2026 వరకు హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యతను చూసుకోనుంది . రెండో దశ పూర్తయిన తర్వాత సైతం అదే సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్లు కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డీపీఆర్‌కి కేంద్రం నుంచి ఆమోదం రాగానే 8 కారిడార్ల పనులను ఏకకాలంలో ప్రారంభం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పలు దఫాలుగా సమావేశమైన విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ అనుకున్నంత తొందరగా ఆ పనులను పూర్తి చేస్తే హైదరాబాద్ వాసులకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ మరోటి ఉండదని స్థానికులు అంటున్నారు. రెండో దశ పూర్తయితే నగర రవాణా వ్యవస్థలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad