విద్యారంగంలో ఎన్నో విజయాలు సాధిస్తూ 40 సంవత్సరాలుగా ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారు చేసిన శ్రీచైతన్య అకాడమీ ఇప్పుడు IIT-JEE, NEET విజయాలను లక్ష్యంగా పెట్టుకుని కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ సుచిత్రలో కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ప్రారంభించింది. ఈ కేంద్రంలో JEE మెయిన్, JEE అడ్వాన్స్డ్, NEET వంటి పోటీ పరీక్షలకు అధిక నాణ్యతతో కూడిన ప్రిపరేషన్ అందించడం లక్ష్యం.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల CEO మరియు డైరక్టర్ శ్రీమతి సుష్మా బొప్పన మాట్లాడుతూ, శ్రీ చైతన్య 40 సంవత్సరాలుగా విద్యా కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందని, 2023లో JEE మరియు NEETలో AIR 1 సాధించడం ద్వారా చారిత్రాత్మక విజయం సాధించామని చెప్పారు. ప్రతి అభ్యాసకుడికి IIT-JEE, NEET పరీక్షల్లో రాణించడానికి మార్గదర్శకత్వం కల్పించడం కోసం హైదరాబాద్ లో టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. మ్యాథమెటిక్స్, సైన్స్ భావనలను బలోపేతం చేసి, పాఠశాల స్థాయిలోనే NEET, JEE పరీక్షలకు పునాది వేయడం మీద తమ దృష్టి ఉందని వివరించారు.
ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపక CEO శ్రీ ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ, వారి నిరూపిత బోధనా విధానం, ఆధునిక సాంకేతికతతో ప్రతి విద్యార్థి కలను సాకారం చేయడం లక్ష్యమని అన్నారు. ఈ టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ 8వ, 9వ, 10వ తరగతుల అభ్యాసకులకు పౌండేషన్ కోర్సులతో పాటు JEE, NEET అభ్యర్థులకు ప్రత్యేక కోచింగ్ అందిస్తుంది. AI ఆధారిత అభ్యాస సాధనాలు, సమగ్ర పరీక్షా సిరీస్లు, ప్రాక్టీస్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విస్తరణ తెలంగాణ విద్యా రంగంలో మార్పులు తీసుకురావడానికి శ్రీచైతన్య నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
శ్రీ చైతన్య అకాడమీ గురించి:
శ్రీ చైతన్య అకాడమీ నాణ్యమైన విద్యలో అగ్రగామిగా ఉంది. ఆధునిక సాంకేతికతను సాంప్రదాయ బోధన పద్ధతులతో కలిపి విద్యార్థులకు హైబ్రిడ్ అభ్యాస అనుభవాన్ని అందిస్తోంది. హైదరాబాద్ లో కొత్తగా ప్రారంభించిన టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్, ప్రభావవంతమైన విద్యనందించడంలో తెలంగాణ విద్యా దృశ్యాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉంది. ఈ కేంద్రంతో హైదరాబాద్ లో 7వ టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ప్రారంభించిన శ్రీచైతన్య అకాడమీ, JEE మరియు NEET కోచింగ్ లో మరింత బలోపేతం అవుతోంది.
ఇన్ఫినిటీ లెర్న్, శ్రేణి విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలను అందించడానికి కృషి చేస్తోంది. 7 లక్షల కంటే ఎక్కువ మంది నమోదు చేసిన వినియోగదారులు, 750 వేలకు పైగా ప్రీమియం కంటెంట్ చందాదారులతో ఇన్ఫినిటీ లెర్న్ ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ఫినిటీ లెర్న్ పాఠశాల పరీక్షలు, ఒలింపియాడ్లు వంటి పలు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఇందులో విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్, ఆధునిక అభ్యాస సాధనాలు ఉన్నాయి. విద్యార్థుల విద్యా, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడే నాణ్యమైన కంటెంట్ ను అందిస్తారు.