Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Sri Chaitanya: ఘనంగా శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్‌పర్సన్‌ జన్మదిన వేడుకలు.. దేశవ్యాప్తంగా 3,127 మంది రక్తదానం 

Sri Chaitanya: ఘనంగా శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్‌పర్సన్‌ జన్మదిన వేడుకలు.. దేశవ్యాప్తంగా 3,127 మంది రక్తదానం 

Sri Chaitanya Employees Blood Donation in India: అటు విద్యాపరంగా, ఇటు సామాజిక సేవా పరంగా ఎల్లప్పుడూ ముందుడే ప్రముఖ విద్యాసంస్థ శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్‌పర్సన్‌ డా. ఝాన్సీ లక్ష్మీబాయి 78వ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. దేశవ్యాప్తంగా శ్రీచైతన్య క్యాంపస్‌లలో మొత్తం 3,127 మంది ఉద్యోగులు రక్తదానం చేసి సమాజ భవిష్యత్తుకు తమ వంతు కృషి చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/rs-brothers-new-showroom-opening-warangal-srileela-inauguration-2025/

ఈ సందర్భంగా డా. ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడారు. ‘విద్యా సేవలో 40 ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులను ఐఐటీయన్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, సివిల్‌ సర్వీసెస్‌ కోసం తీర్చిదిద్దుతున్నాం. ఇది నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా సామాజిక సేవలోనూ మా వంతు కృషి చేస్తున్నాం. ప్రతి ఏటా నా పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది ఉద్యోగులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వారి మానవత్వానికి నితదర్శనం. అందుకు ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. విద్యార్థుల ఉన్నతికి, తల్లిదండ్రుల ఆశయ సాధనకు, సామాజిక సేవ పట్ల శ్రీచైతన్య బాధ్యత ఎప్పటికీ ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది.’ అని ఆమె అన్నారు.  

శ్రీచైతన్య హైదరాబాద్‌ ఈస్ట్‌ సెక్టార్‌లోని ఈసీఐఎల్‌, తార్నాక, నారాయణగూడ, డి.డి. కాలనీ, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగుళూర్‌ జోన్‌ల నుంచి 450 మందికి పైగా శ్రీచైతన్య ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ మియాపూర్‌లోని శ్రీచైతన్య క్యాంపస్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు డా. ఝాన్సీ లక్ష్మీబాయికి ఆయన ధన్యవాదాలు తెలిపి అభినందించారు. దేశవ్యాప్తంగా రక్తం కొరత ఎక్కువగా ఉందని… ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో వేలమంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం మానవత్వం అయితే రక్తం ఇవ్వడం దాతల ఆరోగ్యానికి శ్రేయస్కరమని లక్ష్మీనారాయణ చెప్పారు. 

Also Read: https://teluguprabha.net/career-news/ssc-chsl-2025-tier-1-online-exams-from-november-12-city-intimation-slips-released/

ఇక దిల్‌సుఖ్‌ నగర్‌ జోన్‌లో శ్రీచైతన్య ఎగ్జిక్యూటివ్‌ ఏజీఎం సీహెచ్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. దిల్‌సుఖ్‌ నగర్‌ జోన్‌ నుంచి నీట్‌ 2025లో టాప్‌ 10లోపు 2 ర్యాంకులతో పాటు జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌లో  అత్యుత్తమ ఫలితాలను శ్రీచైతన్య విద్యాసంస్థలు సాధించిందని ఆయన అన్నారు. ఎంతో అంకితభావంతో ఈ విద్యాసంస్థలను ఛైర్‌పర్సన్ డా. ఝాన్సీ లక్ష్మీబాయి ముందుకు తీసుకెళ్తున్నారని.. సామాజిక సేవలోనూ అంతే బాధ్యతతో కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. 

హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌లో ఏజీఎం గుత్తా విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వెస్ట్‌ జోన్‌లో ఏజీఎం జి. రవి కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు, డీన్‌లు, ప్రిన్సిపల్స్‌, ఉపాధ్యాయ, ఉపాధ్యేయతర సిబ్బందిని పాల్గొన్నారు. ఇక విజయవాడలో రక్తదాన శిబిరాన్ని శ్రీచైతన్య డైరెక్టర్‌ టి. నాగేంద్ర కుమార్‌ ప్రారంభించారు. ఆయన కూడా రక్తదానం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad