ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చుక్కెదురైంది. ఆయన ధాఖలు చేసిన క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. 409 సెక్షన్ ఈ కేసులో వర్తించదని.. 13(1)(a) సెక్షన్ వర్తించదంటూ కేటీఆర్ లాయర్లు కోర్టులో వాదించారు. అయితే అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ లాయర్ల వాదనలు విన్న కోర్టు.. చివరికి ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఏసీబీ, ఈడీలకు మాజీ మంత్రిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ కేసులో కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏసీబీ కార్యాలయానికి తన లాయర్లతో కలిసి వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. లాయర్లతో కాకుండా ఒంటరిగానే లోపలికి వెళ్లాలంటూ పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు.
ఆ క్రమంలో ఏసీబీకి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్ కు మరోమారు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025 జనవరి 09వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించారు. గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఈ మేరకు కేటీఆర్‌కు నోటీసులు అందించారు.