Wednesday, January 8, 2025
Homeతెలంగాణపైసా అవినీతి చేయలేదు.. అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తా- కేటీఆర్

పైసా అవినీతి చేయలేదు.. అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తా- కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తాను పైసా అవినీతి కూడా చేయలేదని.. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కక్ష సాధింపులో బాగంగానే తనపై కేసులు పెడుతున్నారని.. అది తెలిసినా ఏసీబీ విచారణకు హాజరయ్యానని ఆయన తెలిపారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టింది అక్రమ కేసు, రాజకీయ ప్రేరేపిత కేసులన్న కేటీఆర్.. పచ్చకామెర్లున్న వారికి లోకం పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు.

- Advertisement -

కనిపిస్తుంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో అరపైసా అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ ఇమేజ్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఫార్ములా రేస్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై కేసు పెట్టారని కేటీఆర్ అన్నారు. విచారణకు లాయర్లతో వస్తానంటే వద్దన్నారని.. హైకోర్టు అనుమతిస్తే తమ న్యాయవాదులతో కలిసి ఏసీబీ విచారణకు హాజరవుతానని ఆయన వివరించారు.

సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ వివరించారు. దుర్మార్గుల నుంచి చట్టపరంగా రక్షణ కోరుతున్నట్లు ఆయన అన్నారు. తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తించారని.. పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు బుకాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. అందుకే ఎలాంటి విచారణకైనా సిద్ధమని పేర్కొన్నారు.

ఇక రాజ్యాంగ హక్కును వినియోగించుకొని పోరాటం చేస్తానన్న కేటీఆర్.. రేవంత్ కు ఆసక్తి పార్ములా-ఈ పై ఉంటే.. తమకు ఫార్మర్ పై ఉందని తెలిపారు. ఎన్ని రకాలుగా కక్ష సాధింపు చర్యలు చేసినా.. తమను ఏమీ చేయలేరని కేటీఆర్ పేర్కొన్నారు. భారత న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. చివరికి న్యాయమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News