Wednesday, April 23, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్ఇంటర్ లో 440కి 434 మార్కులు.. అయినా వెక్కివెక్కి ఏడుస్తున్న అమ్మాయి.. ఎందుకంటే..?

ఇంటర్ లో 440కి 434 మార్కులు.. అయినా వెక్కివెక్కి ఏడుస్తున్న అమ్మాయి.. ఎందుకంటే..?

పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోతే ఎవరికైనా బాధే. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ అయితే ఒక మార్కు తక్కువ వచ్చినా ఏదో పెద్ద ఘోర జరిగినట్లు ఫీల్ అయిపోతుంటారు. నూటికి 99 వచ్చినా సరిపోదు అనే స్థాయికి చేరుకుంటారు. తాజాగా ఇటువంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కొన్ని కాలేజీల్లో ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తుండగా.. ముఖ్యంగా అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఓ విద్యార్థిని మాత్రం వచ్చిన ఫలితాలకే తల్లి ముందు కన్నీరు మున్నీరవుతోంది. ఆమె ఇంటర్‌లో 440కి 434 మార్కులు సాధించింది. సాధారణంగా ఇదొక గొప్ప అచీవ్‌మెంట్‌. కానీ ఆమె మాత్రం ఈ ఫలితంతో ఎంతో బాధపడింది.. తీవ్రంగా ఏడుస్తూ ఉండటం వైరల్ గా మారింది.

ఈ వీడియోలో యువతి తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాల్సింది.. ఆరు మార్కులు తక్కువ వచ్చాయంటూ ఏడవ సాగింది. అయితే ఆమె తల్లి మాత్రం పక్కనే నిలబడి.. ఆరు మార్కులే కదా ఏం కాదులే .. అని తనని సమాధాయించింది. కానీ ఆ యువతి మాత్రం.. అన్నం తినడం మానేసి ఏడుస్తూనే ఉంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో పంచగానే నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పట్టుదలపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

అయితే విద్యార్థుల భవిష్యత్తు పై పోటీ, ఒత్తిడులు, వారి ఆశల తీవ్రత ఇలా ఎక్కడో ఒక చోట బయటపడతుంటాయి. ఈ యువతి వీడియో మాత్రం చదువుపై అంకితభావాన్ని చూపించే ఓ కోణాన్ని చూపిందని చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News