Friday, January 16, 2026
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad: 2 లక్షల ఉద్యోగాలు ఏవి? జాబ్ క్యాలెండర్‌పై సీఎంను నిలదీసిన యువకుడు!

Hyderabad: 2 లక్షల ఉద్యోగాలు ఏవి? జాబ్ క్యాలెండర్‌పై సీఎంను నిలదీసిన యువకుడు!

Young Man fires on Job Calendar: హైదరాబాద్ వేదికగా నిరుద్యోగ యువత నిరసన గళం మరోసారి గర్జించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఓ యువకుడు ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను నట్టేట ముంచిందని ఆ నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

“ఉద్యోగాలు లేక, సరైన ఆదాయం లేక వృద్ధులైన తల్లిదండ్రులను కూడా చూసుకోలేని దుస్థితిలో ఉన్నాం. హాస్టల్ ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేక చదువు పక్కన పెట్టి జొమాటో, స్విగ్గీలలో డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నాం. చదువుకున్న విద్యావంతులను రోడ్డు పాలు చేయడం న్యాయమా?” అని ఓ యువకుడు వాపోయారు.

మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం
తల్లి గర్భం లాంటి పవిత్రమైన అసెంబ్లీలో ఒక మంత్రి మాట్లాడుతూ.. “అసెంబ్లీలో ఉద్యోగాలు ఇవ్వలేము” అని అనడంపై యువత తీవ్రంగా మండిపడుతోంది. చట్టసభల్లో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఇంకెక్కడ పరిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు.

Also Read: Centralized kitchen – రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్

ఉద్యోగాలు అడిగితే లాఠీచార్జా?
హక్కుల కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువకుడు నిలదీశారు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమకు ఇచ్చే బహుమతి లాఠీ దెబ్బలా? అని ఆవేదన చెందారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేదంటే నిరుద్యోగుల సెగ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు.

Also Read: Viral -“మగవారు కూడా ఏడుస్తారు కానీ ఎవరికీ వినిపించకుండా..” సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News