Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లేవారికి సూచన!

Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లో వెళ్లేవారికి సూచన!

Traffic restrictions in Hyderabad: ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ఆదివారం ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు గ్రేస్ క్యాన్సర్ రన్ జరగనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వరకు 10 కి.మీ. పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. విప్రో సర్కిల్ నుంచి ఐఐటీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్​ను నానక్​రామ్‌‌ గూడ – ఓఆర్‌‌ఆర్ మార్గంలో డైవర్ట్ చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

ట్రక్కులు, లారీలు, గూడ్స్‌కు నో అనుమతి: మెహదీపట్నం నుంచి లింగంపల్లి, హెచ్​సీయూ, మజీద్‌‌ బండ్ వైపు వెళ్లే వాహనాలకు క్యారేజ్​వేలో రెండు వైపులా అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే ఉదయం 5:00 నుంచి 8:30 వరకు ట్రక్కులు, లారీలు, గూడ్స్ క్యారియర్లు వంటి భారీ వాహనాలకు గచ్చిబౌలి ట్రాఫిక్ సీఎస్ పరిధిలోని రూట్లలోకి అనుమతి లేదని పేర్కొన్నారు.

Also read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-banjara-hills-750-crore-govt-land-encroachment-hydra-demolition/

గ్రేస్ క్యాన్సర్ రన్లో పాల్గొననున్న ఐటీఐ, ఏటీసీ స్టూడెంట్స్: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరగనున్న గ్లోబ్ గ్రేస్ క్యాన్సర్ రన్ లో ఐటీఐ, ఏటీసీ స్టూడెంట్స్ పాల్గొననున్నారు. మల్లేపల్లి, విజయ్ నగర్ కాలనీ ఐటీఐ, ఏటీసీలో వివిధ కోర్సులు ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులు సుమారు 1200 మంది పాల్గొననున్నారని విజయ్ నగర్ కాలనీ ఐటీఐ ప్రిన్సిపల్ దోవ శైలజ తెలిపారు. 2కే, 5కే, 10 కే రన్ ఉందని అన్నారు. ఈ రన్ లో పాల్గొనే ఐటీఐ స్టూడెంట్లకు ఈ నెల11న మల్లేపల్లి క్యాంపస్ లో వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకే రన్ జరిగే గచ్చిబౌలి ప్రాంగణానికి బస్సుల ద్వారా తీసుకెళుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ రన్ లో అందరు స్టూడెంట్స్ పాల్గొనాలని తెలిపారు. ఈ విషయమై ఫౌండేషన్ నిర్వహకులు కార్మిక శాఖకు, అన్ని విద్యా సంస్థలకు లేఖలు రాశారని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad