Value Zone Store in Ameerpet: రిటైల్ మార్కెట్‌లో ఎన్నో సంచలనాలకు వేదికైన వాల్యూజోన్ హైపర్ మార్కెట్ హైదరాబాద్‌లో మరో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే పటాన్‌చెరు, నాచారం వాసుల్ని కనువిందు చేసిన వాల్యూజోన్.. రాబోయే దసరా, దీపావళి సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని అమీర్‌పేటలో తన కొత్త బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సువిశాలంగా నిర్మించిన ఈ భారీ రిటైల్ స్టోర్‌ను లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని గురువారం ప్రారంభించారు. అనంతరం కస్టమర్లతో కలిసి షాపింగ్ చేస్తూ సందడి చేశారు. కాగా, కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఈ స్టోర్‌లో లభిస్తాయని, 100 కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను ఓకే చోటకు తెచ్చామని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్టోర్‌లో 6500లకు పైగా గ్రాసరీ, హోమ్ నీడ్స్, 2500కు పైగా మెన్స్‌వేర్, వుమెన్ వేర్, కిడ్స్ వేర్, 2000కు పైగా ఐటమ్స్‌పై అద్భుతమైన ఆఫర్లు అందజేస్తున్నామని తెలిపింది. పట్టు చీరలు, వస్త్రాలు, బహుమతులు, అలంకరణ సామాగ్రి, ఆకర్షనీయమైన డిజైనర్ వస్తువులు ఇలా ఎన్నో వైవిధ్యమైన కలెక్షన్లను ఒకే చోట చేర్చి సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాల్యూజోన్‌ను సందర్శించడం ఒక షాపింగ్‌లా మాత్రమే కాకుండా ఒక విహార యాత్రగా అనిపిస్తుందని పేర్కొంది. కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడం కోసం సువిశాలమైన కొనుగోలు కౌంటర్లు, చెక్ అవుట్ కౌంటర్లు, ఆకర్షనీయమైన డిస్‌ప్లేలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అన్ని కలెక్షన్లు ఒకేచోట అందించడమే లక్ష్యమన్న ఫౌండర్ పొట్టి వెంకటేశ్వర్లు..
కొత్త బ్రాంచ్ ఓపెనింగ్‌పై వాల్యూజోన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. “కుటుంబంలోని అన్ని తరాల వారికి కావాల్సిన బహుళ కలెక్షన్లను ఒకే చోట అందిస్తున్నాం. వారికి సరికొత్త షాపింగ్ అనుభవాన్ని పంచడమే లక్ష్యంగా అమీర్‌పేటలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించాం” అని అన్నారు. మరోవైపు, వాల్యూజోన్ ఫౌండర్, ఎండీ శీర్న రాజమౌళి మాట్లాడుతూ.. “ఈ పండుగ వేళ మా కస్టమర్లకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు నగరం నడిబొడ్డు అమీర్‌పేటలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించాం. కస్టమర్లు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.” అని పేర్కొన్నారు. ఇక, వాల్యూజోన్ ఫౌండర్ అండ్ హోల్ టైం డైరెక్టర్ టి. ప్రసాదరావు మాట్లాడుతూ.. “సరసమైన ధరలోనే నాణ్యమైన వస్తువులను ఒకే చోట చేర్చి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాం. అమీర్‌పేటలో కొత్త బ్రాంచును తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది.” అని పేర్కొన్నారు.



