Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్VNR- VJIET: ‘ఇంజినీర్లు సాంకేతిక సృష్టికర్తలే కాదు.. మంచి ప్రపంచానికి శిల్పులు’

VNR- VJIET: ‘ఇంజినీర్లు సాంకేతిక సృష్టికర్తలే కాదు.. మంచి ప్రపంచానికి శిల్పులు’

VNR- VJIET Convergence 2k25R- The Hackathon: హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విఙ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (VNR VJIET) వార్షిక జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం కాన్వర్జెన్స్ 27వ ఎడిషన్‌లో భాగంగా “Convergence 2k25R – ది హ్యాకథాన్”ను సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నవంబర్‌ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ విద్యార్థులు.. పలు. ఈవెంట్లతో పాటు 16 వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాంపస్ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ హ్యాకథాన్‌లు, అత్యాధునిక సాంకేతిక రంగాలపై ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు జరుగుతున్నాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-review-on-slbc-tunnel-project-works/

‘Convergence 2k25R – ది హ్యాకథాన్’ ఈవెంట్‌ను హైదరాబాద్‌ ఆర్‌సీఐ–డీఆర్‌డీఓ, శాస్త్రవేత్త డాక్టర్ జి. మల్లికార్జున రావు ప్రారంభించారు. ‘Experience Innovation’ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ హ్యాకథాన్‌లో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. రోబోటిక్స్, హెల్త్‌కేర్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్‌టెక్, టెక్ ఫర్ సోషల్ గుడ్ వంటి ఎనిమిది విభాగాల్లో రియల్‌ టైం సమస్యలకు పరిష్కారాలను సృష్టిస్తున్నారు. ఈ హ్యాకథాన్‌లో విజేతలకు బహుమతి కూడా అందిస్తున్నారు. రూ. 5,00,000 వరకు నగదు బహుమతులతో పాటు పరిశ్రమ నిపుణుల గైడ్‌లైన్స్‌తో పాటు మరిన్ని అవకాశాలు లభిస్తాయని VNR VJIET ప్రిన్సిపల్‌ డా. సి.డి నాయుడు తెలిపారు. 

“Convergence 2k25R కేవలం ఒక హ్యాకథాన్ మాత్రమే కాదు.. విద్యార్థుల ఊహాశక్తి, ఆవిష్కరణలతో పాటు లక్ష్యసాధనలకు ఒక అద్భుతమైన వేడుక. ఇంజినీర్లు కేవలం సాంకేతికత సృష్టికర్తలు కాదని.. బాధ్యతతో కూడిన మంచి ప్రపంచానికి శిల్పులని గమనించాలి. విద్యార్థి దశలో పుట్టిన ప్రతి ఆలోచన రేపటి భారతదేశాన్ని నిర్మించే శక్తిని కలిగి ఉంది. భావిభారత పౌరులు ధైర్యంగా కలలు కనండి.. వాటిని నిబద్ధతతో ఆవిష్కరించండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయండి.’ అని డా. జి మల్లికార్జున రావు అన్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/chevella-three-sisters-road-accident-emotional-story/

“సాంప్రదాయ ఆలోచనలకు సవాలు విసరడానికి, ఆలోచనలను ప్రభావవంతమైన పరిష్కారాలుగా మార్చుకునే వేదికను ఈ వినూత్న కార్యక్రమం అందిస్తుంది. ఈ వేదిక ద్వారా సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం మాత్రమే కాకుండా నూతన ఆవిష్కరణలు చేయడం నేర్చుకుంటారు. రూ. 5 లక్షల వరకు బహుమతితో పాటు.. విద్యార్థుల సృజనాత్మకత, ఆవిష్కరణలకు గౌరవంతో పాటు గుర్తింపును ఈ హ్యాకథాన్ ఇస్తుంది.” అని డా. సి.డి నాయుడు సూచించారు. 

ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి శ్రీ దుర్గాప్రసాద్ కోడె హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకుంటూ, కాన్సెప్టులను మెరుగుపరుచుకోవడంతో పాటు.. మార్గదర్శకుల సలహాలతో ప్రోటోటైప్ అభివృద్ధిని ప్రారంభించారు. ఇక మంగళవారం ఈ హ్యాకథాన్‌లో న్యాయ నిర్ణేతల సమక్షంలో విజేతలను ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad