Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్TREES 2025: VNR VJIET, CSIR–CRRI ఆధ్వర్యంలో TREES 2025.. గ్రీన్‌, స్మార్ట్‌, స్టెబిలిటీ రవాణా...

TREES 2025: VNR VJIET, CSIR–CRRI ఆధ్వర్యంలో TREES 2025.. గ్రీన్‌, స్మార్ట్‌, స్టెబిలిటీ రవాణా దిశగా ముందడుగు

TREES Conference 2025: Green, Smart, and Resilient Mobility థీమ్‌తో హైదరాబాద్‌లోని VNR విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (VNR VJIET), CSIR–సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) సంయుక్తంగా వినూత్న కార్యక్రమాన్ని నేడు ప్రారభించాయి. “ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ ఎఫర్ట్స్ ఫర్ ఎకాలాజికల్ సస్టైనబిలిటీ (TREES 2025)” పేరిట రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం VNR VJIET క్యాంపస్‌లో విజయవంతంగా ప్రారంభించారు. పరిశోధకులు, ఆవిష్కర్తలు, కీలక భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-inter-exams-schedule-2026-start-february-25/

ఈ TREES 2025 సదస్సులో AI ఆధారిత ట్రాఫిక్ అంచనా వ్యవస్థలు, డ్రోన్ ఆధారిత వంతెన తనిఖీలు, డిజిటల్ ట్విన్స్, రీసైకిల్ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో-పేవ్‌మెంట్ మెటీరియల్స్, బ్లాక్‌చెయిన్ ఆధారిత లాజిస్టిక్స్ వంటి సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించారు. IITలు, NITలు, CSIR ప్రయోగశాలలు, ఇతర ప్రఖ్యాత సంస్థల పరిశోధకులు సస్టైనబుల్ మెటీరియల్స్, ఆటోనమస్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, GIS అన్వయాలు, క్లైమేట్ రిజిలియెంట్ స్మార్ట్ సిటీలపై తమ డాక్యుమెంట్లను ప్రదర్శించారు.

TREES 2025 సదస్సు అద్భుతమైన పరిశోధన, సంస్థల మధ్య సహకారం ద్వారా పర్యావరణానికి అనుకూలమైన, సురక్షితమైన, సమర్థవంతమైన నగరాలను నిర్మించే దిశగా ఎలా ముందుకు సాగవచ్చో చూపిస్తోందని IRSEE, CEI, భారత ప్రభుత్వ ప్రతినిధి (HMRP) D.V.S రాజు అన్నారు. సరైన సాంకేతికత, ఆవిష్కరణలతో రైల్వే రవాణాలో వివిధ రకాల కాలుష్యాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు స్థిరమైన నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 

Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/kohed-village-three-friends-suicide-mystery/

VNRVJIETతో భాగస్వామ్యం స్థిరమైన రవాణా వైపు ఒక ముఖ్యమైన ముందడుగు అని CSIR–CRRI చీఫ్ సైంటిస్ట్ డా. ఎస్. వెల్మురుగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సేఫ్టీ, పేవ్‌మెంట్ డిజైన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిశోధనలలో CRRI నైపుణ్యం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు సేవ చేసేలా స్థిరమైన రహదారి పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక రహదారి స్థిరత్వ ప్రాజెక్టులను తాము చేపట్టామని, ఇంకా దేశానికి సుస్థిరమైన రవాణా పరిష్కారాలను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చీఫ్ సైంటిస్ట్ & హెడ్ (ILT), CSIR–CRRI డా. కయితా రవీందర్ స్పష్టం చేశారు. 

ఈ సదస్సులో డా. రవి శేఖర్, చీఫ్ సైంటిస్ట్, CSIR–CRRI; డా. సి.డి. నాయుడు, ప్రిన్సిపల్, VNR VJIET, డా. బి. చెన్నకేశవరావు, డైరెక్టర్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ & డీన్–అడ్మినిస్ట్రేషన్‌, డా. నాగ తేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రొ. కే. సీతారామాంజనేయులు, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం, హెడ్ ఇన్‌ఛార్జ్ డా. చంద్రమోహన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad