వుడ్ లైన్ ఆర్ట్ ఒక సహజమైన కళాఖండంగా ఆర్ట్ లవర్స్ కు ఆల్ టైం ఫేవరెట్ గా ఉంటోంది. ఖరీదైన మాస్టర్ పీస్ గా వీటికి మంచి డిమాండ్ ఉంది. అరుదైన గిఫ్ట్ ఇవ్వాలంటే వుడ్ లైన్ ఆర్ట్ కు తిరుగుండదు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లాసిక్ ఆర్ట్ కు భలే గిరాకీ ఉండటానికి కారణం అంత ఈజీగా, చవకగా ఈ కళాఖండాలు దొరక్కపోవటమే అని చెప్పాలి. మైసూరు ప్రాంతంలో ఎక్కువగా లభించే ఈ ఆర్ట్ పీసులు హైదరాబాద్ నుమాయిష్ లో ఏర్పాటు చేశారు.
చెక్కపై సహజసిద్ధమైన రంగులు, డిజైన్లతో
వుడ్ లైన్ ఆర్ట్ చెక్కపై రేఖల ద్వారా సృష్టించే ఒక రకమైన అద్భుతమైన కళగా నిలిచింది. చెక్కపై పొందికగా, సహజమైన రంగులు, నాణ్యత కళకు ప్రత్యేకమైన అందాన్ని అందించటమే వీటి స్పెషాలిటీ. వుడ్ లైన్ ఆర్ట్ మైసూర్ ప్రసిద్ధి చెందింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నుమాయిష్ లో వుడ్ లైన్ ఆర్ట్ కొలువుదీరింది. వివిధ దేశాల సంస్కృతులను ప్రతిబింబించే నమూనాలను వుడ్ లైన్ ఆర్ట్‌లో ఏర్పాటు చేశారు. సరళమైన రేఖల నుండి సంక్లిష్టమైన నమూనాల వరకు అనేక రకాల నమూనాలు సృష్టించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. రోజ్ వుడ్ చెక్కలో దృఢమైన పదార్థం వల్ల కళ దీర్ఘకాలం నిలిచి ఉంటుందన్నారు. లేపాక్షిలో దొరకని కళాత్మక వస్తువులు తమ దగ్గర అందుబాటులో ఉన్నాయని వివరించారు.
మైసూరు కళాకారులకే సొంతం
మైసూర్ ప్రాంతానికి చెందిన కులవృత్తులకు చెందిన వారు స్వయంగా చేతితో తయారు చేసిన వుడ్ లైన్స్ ఆర్ట్స్ అందుబాటులో ఉన్నాయని అమృత హ్యాండీక్రాఫ్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ఎలాంటి రంగులు వాడకుండా రంగు చెక్కతోనే సహజంగా తీర్చిదిద్ది జీవం పోస్తారని పేర్కొన్నారు. పది సంవత్సరాల వరకు ఎలాంటి ఫినిషింగ్ పోకుండా ఉంటుందని తెలిపారు. ఒకసారి కొనుగోలు చేసే దీర్ఘకాలంగా నిలుస్తుందని చెప్పారు. ఇంట్లో గోడ అలంకరణ గోడలను అందంగా అలంకరించడానికి వుడ్ లైన్ ఆర్ట్ చాలా అందంగా ఉంటుందన్నారు. ఇంటికి సహజమైన ఆధునిక స్పర్శను ఇవ్వడానికి వుడ్ లైన్ ఆర్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన గిఫ్ట్స్‌గా ఇవ్వడానికి అద్భుతంగా ఉంటుందన్నారు. రూ. 2000 నుంచి 2,40,000 వరకు వుడ్ లైన్ ఆర్ట్ అందుబాటులో ఉన్నాయన్నారు. నుమాయుష్ లో ప్రత్యేకంగా 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు.