Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Yashoda Hospitals: ప్రతి 10 మందిలో ఏడుగురికి గ్యాస్ట్రిక్‌ సమస్యలు: యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ వైద్యులు

Yashoda Hospitals: ప్రతి 10 మందిలో ఏడుగురికి గ్యాస్ట్రిక్‌ సమస్యలు: యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ వైద్యులు

Yashoda Hospitals Gastroenterology Workshop: దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ(GI) వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని యశోద హాస్పిటల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 10 మందిలో ఏడుగురు గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌ ఆధ్వర్యంలో 500 మందికి పైగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాజిస్టులు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య నిపుణులతో అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ శనివారం ప్రారంభించారు. 

- Advertisement -

“యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్‌-2025” పేరుతో రెండు రోజుల పాటు (నవంబర్ 1-2 తేదీల్లో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్‌ను నేడు హోటల్ మరిగోల్ద్‌లో ప్రారంభించారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/workshop-on-breast-imaging-and-interventions-in-basavatarakam-cancer-hospital/

గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అత్యాధునిక వైద్య విధానాలైన థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ విధానాల లైవ్‌ ప్రెజెంటేషన్‌లతో పాటు, అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపీ రంగంలో పురోగతిపై అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులతో ఈ సదస్సులో లోతైన చర్చలు ఉంటాయని డా. పవన్‌ గోరుకంటి అన్నారు. ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న యువ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు, GI వైద్యులకు వారి ఎండోస్కోపిక్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి హ్యాండ్స్ ఆన్ శిక్షణ కూడా ఈ సదస్సులో అందుబాటులో ఉండటం ఇక్కడి యువ వైద్యులకు ఒక గొప్ప అవకాశమని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. రవి శంకర్ మాట్లాడారు. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న అనారోగ్య సమస్యల్లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిసీజ్ (GI) ఒకటి అని చెప్పారు. ముఖ్యంగా యువతలో GI కేసులు వేగంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని.. అధ్యయనాల ప్రకారం ప్రతి 10 మంది భారతీయుల్లో 7గురు ఏదో ఒక గ్యాస్ట్రో సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయని వెల్లడించారు. 

అన్నవాహిక నుంచి గ్యాస్ట్రోఇంటెస్టినల్, గ్యాస్ట్రిక్ సమస్యలు, GI క్యాన్సర్ల‌ వరకు అనేక గ్యాస్ట్రో సమస్యలకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ పద్ధతులు, చికిత్సా విధానాలను ఈ సదస్సుకు హాజరైన యువ డాక్టర్లకు లైవ్ వర్క్ ‌షాప్ ద్వారా వివరించినట్లు డా. రవి శంకర్ తెలిపారు. GI చికిత్సల్లో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతోపాటు గ్యాస్ట్రో వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జాతీయ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ రెండు రోజుల జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

Also Read: https://teluguprabha.net/lifestyle/adhd-symptoms-higher-in-boys-than-girls-says-study/

“యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్సు” అనేది జీర్ణశయాంతర ఉదరకోశ చికిత్స నిర్వహణలో అత్యాధునిక క్లినికల్ ఆవిష్కరణ అని యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ యూనిట్ హెడ్, డాక్టర్. విజయ్ కుమార్ అన్నారు. ఈ రెండు రోజుల అంతర్జాతీయ “కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్” లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అధునాతన జీర్ణ-ఉదరకోశ శస్త్రచికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలోని లైవ్ సెషన్లు.. యువ సర్జన్లకు ఒక గొప్ప వేదిక అని వెల్లడించారు. 

ఈ సదస్సు & లైవ్ వర్క్ షాప్‌లో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు డాక్టర్. రాకేష్ కుమార్ ఆది, డాక్టర్ జి. ఆర్. శ్రీనివాస్ రావు, డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి, యశోద హాస్పిటల్ యూనిట్ హెడ్, డాక్టర్. విజయ్ కుమార్ మరియు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 500 మందికి పైగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad