Saturday, July 12, 2025
HomeTS జిల్లా వార్తలుProjects In Flow: జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల ఇన్ ఫ్లో వివరాలు

Projects In Flow: జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల ఇన్ ఫ్లో వివరాలు

Jurala, Srisialam, Sarar: ఎగువున కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో కృష్ణా నది పరీవాహంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు ఈరోజు ఉదయం వరకు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ మూడు ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

జూరాల రిజర్వాయర్:
తుంగభద్ర నుంచి జూరాల జలాశయానికి 70 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి 67 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.156 మీటర్లు కాగా ప్రస్తుతం 317.250 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.6715 టీఎంసీలు, కాగా ప్రస్తుతం 7.188 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/today-weather-forecast-in-telangana/

శ్రీశైలం జలాశయం:
శ్రీశైలం జలాశయానికి ఎగువున ఉన్న జూరాల నుంచి 67 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దిగువకు 63 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 880 అడుగులు కాగా ప్రస్తుతం 875.60 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

నాగార్జున సాగర్‌ డ్యాం:
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. సాగర్‌కు ప్రస్తుతం 51 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ నుంచి 900 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 317 టీఎంసీలు కాగా ప్రస్తుతం 147 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. శ్రీశైలం ఎడమ, కుడి జల విద్యుత కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంతో సాగర్‌కు ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/brs-mlc-kavitha-key-comments-on-kaleshwaram-project/

కాగా, ఎగువున కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు మరింత వరద కొనసాగే అవకాశం ఉంది. మూడు రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం గణనీయంగా పెరిగి, వర్షాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా మూసురు వర్షాలు పడుతున్నాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News