Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుJadcharla: దేవాలయాల జోలికొస్తే కాళ్లు చేతులు ఇరగకొడతా

Jadcharla: దేవాలయాల జోలికొస్తే కాళ్లు చేతులు ఇరగకొడతా

ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్

జడ్చర్ల నియోజకవర్గంలో దేవాలయాలు, మజీద్ లు, చర్చిలు గాని ఏ మతమైన ఎవరైనా అపవిత్రం చేస్తే కఠిన శిక్ష తప్పదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గ మొదంపల్లి శివాలయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సందర్శించారు.

- Advertisement -

గత శుక్రవారం ఇద్దరు యువకులు శివాలయాన్ని అపవిత్రం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సందర్శించి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అలాగే ఇలాంటి సంఘటనలు మరో గ్రామంలో జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా ఇకపై ఇలాంటి సంఘటనలకు పాల్పడితే వారి కాళ్లు చేతులు ఇరగొట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గ్రామాలలోనీ దేవాలయాలపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం మీ గ్రామంలోని దేవాలయానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad