Thursday, November 21, 2024

Jagityala: జోరుగా కల్తీ

కల్తీ కరీంనగర్

జగిత్యాల జిల్లాలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కల్తీ ఆహారంతో వ్యాపారం చేస్తూ నిర్వాహకులు చేతికి అందినంత దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.

- Advertisement -

జిల్లాలో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పలు ఆహార పదార్థాల్లో ఆరోగ్యానికి హానికరమైన రంగులు, పలుమార్లు వాడిన నూనెతో వంటకాలు మాంసం నిలువ తదితర జగిత్యాల జిల్లాలో పలు హోటళ్లలో వెజిటేబుల్ మరియు నాన్ వెజ్ హోటళ్లలో, రెస్టారెంట్ లలో వంటకాలు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు “క్యాన్సర్” బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ వెళ్లి కూరగాయలను తీసుకువచ్చి కడగకుండానే, శుభ్రం చేయకుండానే వంటకాల్లో వాడుతుండటంతో వాటిపై ఉన్న పురుగు, మందులు, అవశేషాలు ఆహార పదార్థాలలో కలుస్తున్నాయి.

ఇక బిర్యానీ, కబాబ్, గోబీ, మంచూరియా, కొన్ని రకాల మిఠాయిల ఆకర్షణ కోసం సింథటిక్, రంగులు, యజమానులు కలుపు తున్నారు. వాటి ప్రభావం “జీర్ణక్రియ” నాడి వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మరోవైపు ఆహార పదార్థాలను విచ్చలవిడిగా ప్లాస్టిక్, కవర్లలో ప్యాకింగ్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తున్నారు. ఆహార భద్రత అధికారులు పలు పర్యాయాలు సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్న వ్యాపారుల తీరు మారడం లేదు. పలుమార్లు వాడిన నూనెను వంటకాల్లో వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా కబాబ్, బజ్జి, జిలేబి,లా తయారీ లో నూనెలను అనేక సార్లు వాడు తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్ద టోటల్ సోలార్ కాంపోనెంట్స్ టి పి పరికరాలు ఉంటాయి. తనిఖీ కి వెళ్ళినప్పుడు మరగ బెడుతున్న నూనె లో పరికరాన్ని ముంచితే వినియోగానికి పనికి వస్తుందా లేదా అనేది తెలిసి పోతుంది. ఆహార పదార్థాలు తయారీకి ఉప యోగించే వంట నూనెలో పలు వ్యత్యాసాలు ఉంటాయని ఒక లీటరు నూనెను రెండు, మూడుసార్ల కంటే ఎక్కువగా మరిగించకూడదని నిపుణులు అంటున్నారు. అంతకు మించి మరిగిస్తే అందులో ఉండే “టోల్ పోలార్” “కాంపోనెంట్స్” టి పి సి ఫ్రీ రాడికల్స్ గా మారుతోందని అధికారులు చెబుతున్నారు. అధికారులు టి. పి. సి. మీటర్ తో పరిశీలించి నప్పుడు నూనెలో 25%, మించి ఉండకూడదు పలు హోటళ్లలో ఈసి 50%, నుంచి డెబ్బై శాతం 70%, 75%, చూపి స్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్, కోర్టుల నుంచి రెస్టారెంట్లు, హోటల్ల, వరకు ఇదే తంతు కొనసాగుతోంది.
రోజురోజుకు పట్టణ గ్రామీణ వాసులు ఆహారపు అలవాట్లు విధానం మారుతుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనా సాల్ట్ను వినియోగిస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనలతో తయారు చేసిన రంగులు కలిపి వేస్తున్నారు. ఇవి రెండు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తోపుడు బండ్లపై విక్రయించే ఆహారం నుంచి మొదలుకొని హోటల్లు, రెస్టారెంట్లలో సరఫరా చేసే ఆహారం వరకు అన్ని అనుమానాస్పదంగా ఉంటున్నాయి.

నిబంధనలు అధిక్రమిస్తే చర్యలు తప్పవు-అనూష ఆహార భద్రత అధికారి జగిత్యాల

ఆహార పదార్థాల తయారీ నిలువ, విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆహార భద్రత అధికారి అనూష అన్నారు. కొంతమంది నాసిరకం కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తుండడంతో హానికర రంగులు కలుపుతున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తున్నాము. వారిపై కేసులు నమోదు చేశాం కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. సిబ్బంది కొరత ఉన్న ఎప్పటి కప్పుడు తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటున్నాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News