Friday, January 31, 2025
HomeTS జిల్లా వార్తలుకామారెడ్డిFood poisoning: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా పుడ్ పాయిజన్ ఘటనలు..MLC కవిత

Food poisoning: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా పుడ్ పాయిజన్ ఘటనలు..MLC కవిత

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు, వసతి గృహల్లో వరుసగా ఒక్కరోజే పుడ్ పాయిజన్ (Food poisoning) అయి విద్యార్థులు సూమారు 61 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా గురువారం మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుడ్ పాయిజన్ కేసులు నమోదు అవుతున్నాయని విమర్శించారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 14 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టిన పాఠశాల సిబ్బంది పెట్టటంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనతో ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు సూర్యపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన 22 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది కోలుకోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇంకా నారాయణ పేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 25 మంది మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News