సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు మట్టి స్నానాలు చేయాలని కామారెడ్డి ఎస్ ఎస్ వై యోగ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పైడి రామ్ రెడ్డి సూచించారు. ఆదివారం కామారెడ్డి ఎస్ ఎస్ వై యోగా కేంద్రంలో యోగా శిక్షణ పొందుతున్న 120 మంది మట్టి స్నానాలు ఆచరించారు.
చెరువు మట్టితో
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి పెద్ద చెరువులో శిక్షణ పొందుతున్న యోగా సభ్యులు పార్టీ స్థానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వారు పలు రకాల ఆసనాలు వేశారు. జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో మట్టి స్నానాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెరువులో మట్టి స్థానాల్లో ఆచరించడం వల్ల చర్మ వ్యాధులు దూరం అవుతాయని తెలిపారు. సోరియాసి స్ తెల్ల మచ్చలు వంటి పలు రకాల చర్మ రోగాలు దూరం అవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెట్టి గాడి అంజయ్య, అంతి రెడ్డి, రఘు కుమార్, అనిల్ రెడ్డి, కోలా సిద్దా గౌడ్, ఎల్లయ్య, లద్దూరి లక్ష్మీపతి యాదవ్, గురు చరణ్, నరేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.