Sunday, February 23, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Chigurumamidi: రైతులకు తప్పని యూరియా తిప్పలు

Chigurumamidi: రైతులకు తప్పని యూరియా తిప్పలు

యూరియా తిప్పలు

మండలంలోని రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు ఎరువుల కొరతతో క్యూలైన్లలో ఉదయం నుంచే పడిగాపులు పడుతున్నా చివరికి నిరాశే ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

యూరియా కోసం

వివరాల్లోకి వెళితే శనివారం చిగురుమామిడి మండలంలోని ఇందుర్తిలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడి నిరసించి చివరికి వారి పాదరక్షలు క్యూలైన్లో ఉంచారు. వచ్చిన యూరియా బస్తాలు 200 అయితే వరస క్రమంలో నిలబడ్డా రైతులు 300 మంది సరిపడా బస్తాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. పరిస్థితిని సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే రెండు లారీలలో 1350 యూరియా బస్తాలను ఇంధుర్తి సొసైటీకి పంపించి రైతులకు ఇబ్బంది లేకుండా చూశారు.

17 గ్రామాల్లో 10 వేల మంది రైతులు

అంతకుముందు రైతులకు ఒకరికి రెండు బస్తాల చొప్పున ఇచ్చారని మరో రెండు లారీలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కాగా మండలంలోని 17 గ్రామాల్లో దాదాపు 10 వేల మంది రైతులుండగా వారిలో కనీసం వెయ్యి మందికి కూడా ఎరువులు అందలేదు. చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాల ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు రెండు నుంచి మూడు సార్లు బస్తాలు ఇవ్వడంతో పలువురు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలుమార్లు ఎరువులు తీసుకున్న రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రస్తున్నట్లు రైతుల నుంచి ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా సింగిల్ విండో అధికారులు ఎరువులు అవసరం ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలని, బ్లాక్ మార్కెట్ కు తరలకుండా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News