జాతీయ పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ గణతంత్ర దినోత్సవం. ఈ వేడుకలను దేశవ్యాప్తంగా పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు, దేశ భక్తి ఉన్న ప్రజలు వ్యక్తిగతంగా కూడా ఇండ్లలో జాతీయ జెండా ఆవిష్కరించి నిర్వహించుకుంటారు. దేశ భక్తిని చాటుతారు కానీ అందుకు భిన్నంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట పల్లె దావఖానలో ఆదివారం గణంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకపోవడంతో గ్రామస్తులు, గ్రామ విద్యావంతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గణతంత్ర వేడుకల సందర్భంగా పల్లె దావాఖన తాళం వేసి ఉందని, గ్రామంలో ప్రధాన చౌరస్తాలు పంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు, వార్డులలో కుల సంఘాల భవనాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. కానీ పల్లె దావఖాన వద్ద జెండా ఆవిష్కరించకపోవటం అందరినీ షాక్ ఇచ్చింది. ఉదయం 11 గంటలు అయినా కూడా సిబ్బంది రాలేదు. దీంతో జెండా ఆవిష్కరించే తీరిక కూడా లేదా అని పలువురు గ్రామస్తులు అన్నారు.