అపర కైలాసంగా పేరుగాంచిన జనగామ శివాలయంలో ఈనెల 26న మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రబట్ల రమేష్ శర్మ తెలిపారు. జనగామ శివాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరించారు. ఉదయం 4 గంటలకు మంగళవాయిద్యాలతో స్వామి వారి మేలుకొలుపు, గణపతి పూజ, రుద్రాభిషేకం పూజలు నిర్వహించి, సాయంత్రం ఆరున్నర గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.

మహా శివరాత్రి పర్వదినం రోజున మునుపెన్నడూ లేని విధంగా భక్తులు ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకునేలా ఆలయం చుట్టూ భారీ కేడ్లు ఏర్పాటు చేశామన్నారు. పురాతన ఇతిహాస చరిత్ర కలిగిన జనగామ శివాలయంను దర్శించుకొని స్వామి వారి కృపకటక్షలు పొందాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జువ్వాడి మాధవరావు, ప్రధానకార్యదర్శి జనగామ శివ,కోశాధికారి చిలుక శ్రీనివాస్,తోటపల్లి శ్రీనివాస్, రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.