రామగుండం నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 25 వ తేదిన గోదావరిఖని మార్కండేయ కాలనీ శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించినున్నట్లు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.
- Advertisement -
ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గంలోని మాజీ జడ్పీటీసిలు మాజీ ఎంపిపిలు, మాజీ కార్పోరేటర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసీలు, మాజీ మార్కెట్ కమిటీలు, ఫ్యాక్స్ కమిటిలు, మండల పట్టణ నాయకులు కార్యకర్తలు హజరు కావాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.