హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయినాథ్ రెడ్డిని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు. సాయినాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.