Wednesday, November 13, 2024
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Karimnagar: కేసుల పెండింగ్ సంఖ్య తగ్గించాలి

Karimnagar: కేసుల పెండింగ్ సంఖ్య తగ్గించాలి

న్యాయ సేవ..

కోర్టులో కేసుల పెండింగ్ సంఖ్యను తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక ఆరాధ్య అన్నారు.

- Advertisement -

కరీంనగర్ కోర్టు ఆవరణలో పోక్సో, ఫ్యామిలీ కోర్టు సహా 12 కోర్టులు ఉండే జిల్లా కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి, సీతారాంపూర్ రోడ్డులో న్యాయాధికారుల నివాస గృహాల భవనాల నిర్మాణాలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి బి.ప్రతిమ స్వాగతం పలికారు. పోలీసులు ప్రధాన్ న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు.

భవన నిర్మాణం స్థలంలో భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే మాట్లాడుతూ కరీంనగర్ కోర్టు భవనం 1956లో ప్రారంభించారని తెలిపారు. హైకోర్టు భవనానికి ఉపయోగించబోయే స్టోన్ కరీంనగర్ జిల్లా నుండి రాబోతుందని తెలిపారు. కేసుల పెండింగ్ సంఖ్యను తగ్గించాలని అన్నారు. ఇందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. కరీంనగర్ కోర్ట్ భవనం 18 నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కృషి చేసిన పూర్వపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావుకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ టి.వినోద్ కుమార్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాసరావు, హైకోర్టు పూర్వపు జడ్జి పి.నవీన్ రావు, కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ టీఎస్ బి. ప్రతిమ, తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు లక్షన్ కుమార్, బార్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పీవీ రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News